క్రికెట్‌ లవర్స్‌ అంతా సౌతాఫ్రికా టెస్ట్‌ని ఫాలో అవుతూ బిజీగా ఉన్నారు. కోహ్లీసేన ప్రోటీస్‌ని సొంతగడ్డపై ఓడించి చరిత్ర సృష్టిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రెండేళ్లుగా బయో బబుల్‌తో విసిగిపోయిన ఇండియన్‌ క్రికెటర్స్‌ మాత్రం ఆటవిడుపుకోసం 'పుష్ప'ని ఫాలో అవుతున్నారు. తగ్గేదేలే అంటూ పుష్పరాజుల్లా మారుతున్నారు.

అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా 2021కి లాస్ట్‌ పంచ్ ఇచ్చింది. భారీ వసూళ్లతో పోయినేడాదికి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ బెల్ట్‌లోనూ ఈ మూవీకి క్రేజీ కలెక్షన్లు వచ్చాయి. ఒక్క నార్త్‌ ఏరియాలోనే ఈ సినిమా 70 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నార్త్‌ మార్కెట్‌ని కూడా ఆశ్చర్యపరుస్తూ మాసివ్‌ హిట్‌గా నిలిచింది.

అల్లు అర్జున్‌ 'పుష్ప' పెర్ఫామెన్స్‌కి బాలీవుడ్‌ సెలబ్స్‌ అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఆ లుక్, యాక్టింగ్‌ సూపర్బ్‌ అని పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ 'పుష్ప' ఫీవర్‌ బాలీవుడ్‌తో పాటు క్రికెటర్స్‌నీ తాకింది. ఇప్పటికే డేవిడ్‌ వార్నర్‌ 'పుష్ప' గెటప్‌లో కనిపిస్తే, ఇండియన్‌ క్రికెట్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్‌ శిఖర్ ధావన్ కూడా 'పుష్ప' డైలాగులతో హంగామా చేశారు.

డేవిడ్‌ వార్నర్‌ ఏదో ఫేస్‌ యాప్‌తో 'పుష్ప'లాగా మారిపోతే, రవీంద్ర జడేజా మాత్రం సేమ్‌ టు సేమ్‌ పుష్పరాజ్‌లాగే మేకోవర్ అయ్యాడు. గడ్డం, మీసాలు, గ్రాఫిక్స్‌ బీడీతో పుష్పని దింపేశాడు. ఇక ఈ హంగామా చూస్తోంటే, నార్త్‌లో 'బాహుబలి'తో ప్రభాస్‌కి ఏ రేంజ్ ఫాలోయింగ్ వచ్చిందో, 'పుష్ప'తో బన్నికి అదే స్థాయిలో గుర్తింపు వస్తున్నట్లు కనిపిస్తోంది. మరి అల్లు అర్జున్‌ ఈ స్టార్డమ్‌ని ఎలా క్యాష్‌ చేసుకుంటాడో చూడాలి. అల్లు అర్జున్ ఏం చేసినా అది హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా అదే యూత్ కు ఐకాన్ లా తయారవుతోంది. ఎర్రచందనం స్మగ్లర్ లా రగ్గడ్ లుక్ లో కనిపించిన అల్లు అర్జున్ ను అచ్చం ఫాలో అవుతున్నారు ప్రముఖులు. అదే హెయిర్ స్టైల్ తో సందడి చేస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: