
ఎప్పుడో శ్రీమంతుడు సినిమా సమయంలో మహేష్‌తో మళ్లీ సినిమా తెరకెక్కించేందుకు వేచి చూస్తున్నానని చెప్పాడు పూరీ. ఆ సినిమాలో తన పోకిరీ చిత్రంలోని ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు అన్న డైలాగ్ స్ఫూర్తితో వాడే నామొగుడు అనే పాట ఉంటుంది. ఆ మొగుడి కోసం నేనూ వెయిటింగ్ అంటూ పూరీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే అదే సమయంలో కెరీర్‌లో ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి ఫెయిల్యూర్‌లు రావడంతో మహేష్ పూరీని వెయిటింగ్‌లోనే ఉంచేశాడు. మహేష్ సర్కారువారి పాట చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో పూరీ కోరిక తీరేందుకు మరికొంతకాలం వేచిచూడక తప్పేట్టులేదు. ఒకవేళ ఈ కాంబో కనుక మళ్లీ సెట్ అయితే బ్లాక్‌బస్టర్ విజయం సాధించే స్థాయిలో కసిగా పని చేస్తానని, దానికి తగ్గ కథ ఇప్పటికే సిద్ధం చేసుకున్నానని పూరీ ఇప్పటికే సన్నిహితులతో చెపుతున్నట్టు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. మరి వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ ఎప్పటికి సాధ్యమవుతుందో చూడాలి.