ఇలియానా తెలుగులో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ 'బర్ఫీ' సినిమాతో బెస్ట్ యాక్టర్ అనే ఇమేజ్‌ రాగానే హిందీలోనే ఉండిపోయింది. అదే సమయంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూనీబోన్‌తో లవ్‌లో పడింది. అయితే ఈ లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌ పడిన తర్వాత ఇలియానా కెరీర్‌కి బ్రేకులు పడ్డాయి. అటు హిందీలో అవకాశాలు రావడం లేదు. తెలుగులోనూ ఎవరూ పట్టించుకోవడంలేదు.  

రియా చక్రవర్తి తెలుగు నుంచి బాలీవుడ్‌కి వెళ్లాక అక్కడ బిజీ కావాలని చాలా ట్రై చేసింది. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ లవ్‌స్టోరీతో ముంబాయి సర్కిల్స్‌లో పాపులర్ కాగానే, వరుస అవకాశాలు వస్తాయనే టాక్ వచ్చింది. కానీ సుశాంత్‌ సింగ్‌ అనుమానాస్పద మృతిలో నిందితురాలిగా జైలుకి వెళ్లాక, రియా జర్నీకి బ్రేకులు పడ్డాయి. మళ్లీ కెరీర్‌కి బూస్టప్‌ ఇచ్చే సినిమా కోసం ఎదురుచూస్తోంది రియా. అదితిరావ్ హైదరీ తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ అనే తేడా లేకుండా పాన్‌ ఇండియన్‌ లెవల్లో సినిమాలు చేస్తోంది. కానీ ఒక్కచోట కూడా స్టార్డమ్‌ లేదు. అన్ని ఏరియాల్లో స్ట్రగులింగ్ ఫేజ్‌లోనే ఉంది అదితి. సూపర్‌ హిట్‌ ఇచ్చే దర్శకుడి కోసం వెతుకుతోంది.

హీరోయిన్ల కెరీర్‌ స్పాన్ చాలా తక్కువ. థర్టీ ఫైవ్‌ దాటితే కెరీర్‌ స్లో అయిపోతుంది. దీనికితోడు ఫ్లాపులొచ్చాయంటే థర్టీ క్రాస్‌ చెయ్యకుండానే బ్రేకులు పడిపోతాయి. బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు ఇలాంటి డేంజర్‌ జోన్‌లోనే ఉన్నారు. ఫ్లాపులతో పడిపోతోన్న కెరీర్‌ని కాపాడుకోవడానికి తెగ కష్టపడుతున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాక బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది. హిందీలో స్టార్ హీరోయిన్‌ కావాలని వరుస సినిమాలు చేస్తోంది. అజయ్ దేవగణ్, సిద్ధార్థ్‌ మల్హోత్రా లాంటి హీరోలతో సినిమాలు చేసినా అక్కడ స్టార్డమ్ రాలేదు. అయితే ఇప్పుడు రకుల్‌ లిస్ట్‌లో అరడజనుకిపైగా హిందీ సినిమాలున్నాయి. వీటిల్లో రెండు మూడు సినిమాలు హిట్‌ అయినా కెరీర్‌ సెట్ అవుతుందని ఆశపడుతోంది రకుల్.

రాధికా ఆప్టే ఏం మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది. సోషల్‌ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే బోల్డ్‌ స్టేట్మెంట్స్‌తో పాటు 'పార్చెడ్' లాంటి సినిమాల్లో బోల్డ్‌ సీన్స్‌ చేసిన రాధికకి బాలీవుడ్‌లో భారీ అవకాశాలు మాత్రం రాట్లేదు. హ్యూమా ఖురేషి 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' టైమ్‌లో సెన్సేషనల్ హీరోయిన్‌గా కనిపించింది. కానీ ఆ తర్వాత హ్యూమాకి చెప్పుకోదగ్గ హిట్స్‌ రాలేదు. వరుస ఫ్లాపులతో ఈమె కెరీర్‌ స్లో అయ్యింది. ఇప్పుడు హ్యూమా లిస్ట్‌లో 'డబుల్ ఎక్స్‌ఎల్' సినిమా మాత్రమే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: