సమంత.. ఈమె ఏమనుకుంటుందో తెలియదు కానీ డబ్బు వస్తే చాలు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు అయినా సరే లేదా ఎలాంటి పాత్రలో అయినా సరే నటిస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంది అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సినీ ప్రేక్షకులు.. సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఏదైనా చెప్పినప్పుడు ప్రజలు ఆచరిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే.. అందుకే స్టార్ సెలబ్రిటీలు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారు ప్రమోట్ చేసే బ్రాండ్లు ప్రజలకు మంచి చేస్తాయా లేక చెడు చేస్తాయా..అనే విషయాలను ఆలోచించి మరీ ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది డబ్బు కోసం చేసే ప్రమోషన్స్ వల్ల తీవ్రంగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు.ఇప్పటికే అల్లు అర్జున్, రెజీనా, రష్మి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు కొన్ని వాణిజ్య ప్రకటనలలో వారి బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ నెటిజన్ల చేత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా సమంతా కూడా నెటిజన్ల ఆగ్రహానికి బలికావాల్సి వచ్చింది.. ఇందుకు గల కారణం ఏమిటంటే ఇప్పటికే సాకీ, అర్బన్ కిసాన్ , కుర్కురే.. వంటి ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేస్తున్న సమంత తాజాగా క్రిప్టోకరెన్సీకి కూడా ప్రచారకర్త గా మారింది. క్రిప్టో కరెన్సీ కి సంబంధించి అన్ని విషయాలను ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తూ .. 100 రూపాయలతో కూడా క్రిప్టోకరెన్సీ మొదలుపెట్టవచ్చు అంటూ ఆమె తాజాగా విడుదల చేసిన ఒక వీడియో ప్రస్తుతం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటోంది..


ఇక క్రిప్టోకరెన్సీ ని ప్రభుత్వం ఎంత నియంత్రణ చేయాలి అనుకుంటున్న వీటికి మాత్రం ఆదరణ అయితే తగ్గడం లేదనే చెప్పాలి.. ఆయుష్మాన్ ఖురానా వంటి వారు ఈ క్రిప్టోకరెన్సీ కి ప్రచారకర్తలుగా పనిచేసి ట్రోల్స్ గురైన విషయం తెలిసిందే. సమంత కూడా ఇలా క్రిప్టోకరెన్సీ ని ప్రచారం చేయడంతో  హెచ్చరికతో వచ్చే సిగరెట్లను మీరు ఆమోదిస్తారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. డబ్బు కోసం మరీ ఇంతలా దిగజారిపోతారా అంటూ ఆమె పై విమర్శలు గుప్పిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: