కీర్తి సురేష్.. తమిళ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో చాలా సినిమాలలో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది .. ఇకపోతే చిన్న చిన్న హీరోల సరసన నటించి తనకంటూ ఒక ఇమేజ్ ను కూడా సంపాదించుకో లేకపోయినా కీర్తి సురేష్ మహానటి సినిమా తో నిజంగానే ఒక మహానటి అని స్టార్ హీరోల చేత అనిపించేలా చేసుకుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కీర్తి సురేష్ ను కీర్తి సురేష్ అని పిలవడం కన్నా మహానటి అని పిలిచే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక ఈమె పాత్ర నచ్చితే ఇమేజ్ వస్తుంది అంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనుకాడటం లేదు.అవకాశాలు తగ్గుతున్న సమయంలో సీనియర్ స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. కానీ ఈమె అనుకున్నంత సక్సెస్ పొందలేక పోవడం గమనార్హం అందుకే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించాలని నిర్ణయించుకుంది కీర్తి సురేష్ అదృష్టాన్ని వెతుక్కునే ఒక అమ్మాయి పాత్రలో గుడ్ లక్ సఖి అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ను నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేయగా అనుకున్న స్థాయిలో విజయాన్ని పొందలేక పోవడం గమనార్హం.. మొదటి  షో తోనే చాలా చెత్త రికార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా..
జనవరి 26 వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగులో చాలా చెత్త రికార్డుని సొంతం చేసుకోవడంతో తమిళ్ తో పాటు మలయాళం సినీ ఇండస్ట్రీలో థియేటర్లలో సినిమాను నిలిపి వేయడం జరిగింది. కాకపోతే ఈ రెండు భాషలలో సినిమాల్ని నిలిపివేయడంతో ఇక పూర్తిగా కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది అని చెప్పవచ్చు. అక్కడ తమిళంతో పాటు మలయాళం సినీ ఇండస్ట్రీలో ఈ సినిమాను విడుదల చేయకుండా నిలిపివేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. షకీలా చేయడం వల్ల కీర్తి సురేష్ కెరియర్కు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: