ప్రియాంక చోప్రా తన కంటే చిన్నవాడైన నిక్ పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. నిక్ జోనాస్ తో పెళ్లి తర్వాత హాలీవుడ్లో కూడా ఈ అమ్మడి పేరు తెలిసిపోయింది దీంతో అక్కడ అవకాశాలు అందుకుంటు హాలీవుడ్లో కూడా బాగా రాణించింది. అయితే ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు ఆత్మ కథలు రాసుకోవడం కామన్ గా మారిపోయింది. ప్రియాంక చోప్రా కూడా 201లో ఆత్మకథ 'అన్ ఫినిష్డ్ ఒన్ మెమరీ' అనే పుస్తకం రాస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని 2019లో విడుదల చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఈ పుస్తకమ్ రాసే సమయంలో తనకు ఎలాంటి భయాలను ఎదుర్కొన్నాను అన్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ పుస్తకం రాసే సమయంలో ఎంతగానో భయం వేసేది. ఈ పుస్తకం నేను రాయలేను ఏమో అని చాలా సార్లు అనుకున్నా.. ఏ ఇంటర్వ్యూలో చెప్పని నిజాలు పుస్తకంలో బయటపెట్టాలని అనుకున్నాం.. పుస్తకం రాసే సమయంలో వచ్చే ఆలోచనలు నాలో భయాన్ని కలిగించాయ్ అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ పుస్తకం చదివాక అందరికీ నా బలాలు బలహీనతలు ఫెయిల్యూర్స్ కూడా తెలిసిపోతాయి ఏమో అని భయపడ్డాను. ఒక మహిళగా అందరికీ నా బలాలు మాత్రమే తెలపాలని అనుకున్నాను. ప్రశాంతంగా బతకడానికి కొన్నింటిని దాచితేనే మంచిది అని అనుకున్నాను అంటూ తెలిపింది ప్రియాంక చోప్రా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి