
రామ్ ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక మల్టీలింగ్వల్కి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కబోతోంది ఈ సినిమా. ఇక బోయపాటి సినిమాల్లో యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో, హీరో లుక్ కూడా అంతే స్పెషల్‌గా ఉండేలా చూసుకుంటాడు. హీరోలని కండలరాయుళ్లుగా మార్చుతుంటాడు. ఇప్పుడు రామ్‌ని ఎలా ప్రజెంట్ చేస్తాడని రామ్ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అఖిల్ మాసీ యాక్షన్ హిట్ కోసం చాాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడీ లోటుని పూడ్చుకునేందుకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యాడు. హృతిక్ రోషన్ రేంజ్లో మజిల్ట్ బాడీతో స్టైలిష్ స్టార్‌గా మారాడు. ఇక పూరీ జగన్నాథ్ డైలాగ్ లు ఎంత క్యాచీగా రాస్తాడో, హీరోలని అంతే కొత్తగా ప్రజెంట్ చేస్తుంటాడు. హీరోల పాత ఇమేజ్‌కి భిన్నంగా చూపిస్తుంటాడు. 'లైగర్'లో కూడా విజయ్ దేవరకొండని కొత్త లుక్‌లోకి తీసుకెళ్లాడు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న ఈ సినిమా కోసం విజయ్ బీస్ట్‌గా మారాడు. బాక్సర్ లుక్ కోసం గంటలకొద్ది వర్కవుట్స్ చేశాడు.
వరుణ్ తేజ్ ఇప్పటివరకు రెగ్యులర్ లుక్‌లోనే కనిపించాడు. మాస్ రోల్స్ చేసినా మజిల్డ్ బాడీపై పెద్దగా ఫోకస్ చెయ్యలేదు. అయితే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోన్న 'గని' కోసం చెమటలు చిందించాడు. జిమ్‌లో గంటలకొద్దీ కసరత్తులు చేసి కండలు పెంచాడు. అలాగే బాక్సింగ్‌లోనూ ట్రైనింగ్ తీసుకున్నాడు వరుణ్. అడివి శేష్ ప్రతీ సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటాడు. అయితే లుక్ విషయంలో మాత్రం పెద్దగా మార్పులు చేర్పులవైపు వెళ్లలేదు. ఒక ముంబాయి 26/11 ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథాంశంతో 'మేజర్' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో శేష్ కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించడానికి 10 కేజీల వరకు బరువు తగ్గాడు. అలాగే జవాన్లా ఫిట్‌గా కనిపించడానికి గంటలకొద్దీ జిమ్ లలో గడిపాడు.