ఇక గంగూ భాయ్ సినిమా పై సమంత ఏకంగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.. ఈ సినిమాలో ఆలియా భట్ యొక్క అందం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకొచ్చింది సమంత. ఆమె నటన గురించి కూడా ప్రభావితం చేసే టువంటి ఒక పోస్ట్ ను కూడా షేర్ చేసింది తన ఇంస్టాగ్రామ్ లో. ఇక ఫోటోలు, ఆలియాభట్ ఫోటోలు షేర్ చేస్తూ గంగూ భాయ్ ఒక మాస్టర్ పిక్ సినిమా అంటూ తెలియజేసింది.. ఈ సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్, ఆమె ఎక్స్ప్రెషన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని తెలియజేసింది. ఇక ఆలియాభట్ ఎంతో అద్భుతమైన నటనని చూపించింది అంటూ తన పై అభిమానం చాటుకుంది సమంత.

ఒక స్టార్ హీరోయిన్ అయి వుండి.. సమంత ఇలా మరొక హీరోయిన్ గురించి స్పందించడం విశేషంగా మారింది. సమంత మనసులో ఏమాత్రం కల్మషం లేని హీరోయిన్ గా ఈ పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు సైతం కామెంట్ చేయడం జరుగుతోంది.. సమంత ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే ఆమె చేతిలో వరుస మూవీలు ఉన్నాయి.. ప్రస్తుతం ఆ సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ప్రతి సినిమా కూడా ఎంతో భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరుగుతోంది.. ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి