ఇప్పుడు తమిళంలో ఎక్కువగా ఒక చిత్రం గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఆ చిత్రం ఏమిటంటే విక్రమ్.. ఇక ఈ సినిమా కోసం ఇతర భాషల ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ఏమిటంటే ఈ సినిమాలోని ఉండే కాంబినేషన్స్ అంతగా రేకెత్తిస్తున్నాయి అని చెప్పవచ్చు.. ఇందులో విలక్షణమైన నటుడు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, కమలహాసన్ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ ముగ్గురు కలిసి చేయడంతో ఈ సినిమా చాలా ప్రత్యేకం గా మారుతోంది.



ఇక విడివిడిగా హీరోలకు ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ కాంబినేషన్ ని తెరకెక్కించడం జరిగింది. ఇక కమల్ హాసన్, డైరెక్టర్ లోకేష్ కాంబినేషన్లో సినిమా వస్తుందని అనౌన్స్మెంట్ రాగానే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయట. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వేసవిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్రబృందం. అయితే ఈ నెల 14వ తేదిన విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు ఇదివరకే వెల్లడించారు.

అయితే ఈ సినిమా గురించి తమన్నా మీడియా వర్గాలు మాత్రం మే 26న విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఇక ఏప్రిల్ నెలలో విజయ నటిస్తున్న బెస్ట్ మూవీ విడుదల అవుతుందని.. ఇక అదే రోజున కేజీఎఫ్-2 కూడా రాబోతోందని సమాచారం. అయితే ఇందులో విజయ్ మూవీనే కాస్త ముందు వచ్చే అంచనాలు ఉన్నాయని సమాచారం. ఇక ఆ తరువాత నాలుగు వారాలు గ్యాప్ ఉండేలా చూసుకుని మే 26వ తేదీన విక్రమ్ సినిమాలు విడుదల చేయడానికి చిత్ర బృందం ఫిక్స్ అయ్యారట. ఇక ఈ చిత్రం తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: