ఈ సినిమాకు దర్శకుడిగా సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఒక రాబరీ నేపధ్యంలో సాగుతుందని సురేందర్ రెడ్డి హింట్ ఇచ్చారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఏ సినిమాలో అయినా హీరోకు ధీటుగా విలన్ ఉన్నప్పుడే వారిద్దరి మధ్య సన్నివేశాలు ఎంతగానో అలరిస్తాయి. అందుకే ఈ సినిమాలో విలన్ గా ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ఎంచుకున్నారు. అయినా మరొక ఇద్దరిని కూడా ఎంపిక చేశారు డైరెక్టర్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించగలడు అని నిరూపించుకున్నాడు. అంతే కాకుండా అఖిల్ బాడీ లాంగ్వేజ్ కు సూట్ అవుతాడని ఆదిని విలన్ గా అనుకున్నారు.
ఇక ఇందులో మరో విలన్ గా బాలీవుడ్ నటుడు మరియు కరోనా సమయంలో ఆపద్బాంధవుడిగా మారిన సోను సూద్ ను తీసుకున్నారు. ఈ వార్త తెలిసిన అఖిల్ అభిమానులు ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నారు. అలా ఈ సినిమాలో అఖిల్ మొత్తం ముగ్గురిని ఢీ కొట్టనున్నాడు అని తెలుస్తోంది. దీనితో రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి చూద్దాం ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదా?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి