ఇక ఇప్పటికే రేవ్ పార్టీలో పట్టుబడిన సెలబ్రిటీలు వారి పిల్లల పేర్లు కూడా బయటకు రావడం గమనార్హం. బిగ్ బాస్ విన్నర్ అలాగే టాలీవుడ్ ప్రముఖ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉండడంతో ఈ వ్యవహారం కాస్త బాగా హాట్ టాపిక్ గా మారింది. పబ్ లో నిర్వహించిన పార్టీలో వీరంతా డ్రగ్స్ వాడినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ పార్టీలో అనేక మంది యువతులు కూడా పాల్గొనడం జరిగింది ఇకపోతే నిహారిక కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు ఆమెను పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్లు చర్చనీయాంశంగా మారడం తో ఈ విషయం సోషల్ మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ పార్టీలో యువ హీరో తో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలు కూడా ఉన్నారు అని సమాచారం. పుడింగ్ మిగ్ పబ్ లో తెల్లవారే వరకు నిర్వహిస్తూ యాజమాన్యం నానా హంగామా ఇస్తున్నట్టు తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక ఈ రేవ్ పార్టీ దాడుల్లో ఉప్పల్ అనిల్ కుమార్ తో పాటు సిరీస్ రాజు కుమారుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్ బ్లూ హోటల్ ని అధికారులు సీజ్ చేయడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి