టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో వున్నాడు. అందువల్ల పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 66 వ సినిమాకి థమన్ సంగీత దర్శకుడిగా ఫిక్సయ్యాడు.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఆర్.సి 15 లాంటి క్రేజీ పాన్ ఇండియా సినిమాకి సంగీత దర్శకుడిగా ఫిక్సయ్యాక థమన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. అందుకే ఇంతలోనే విజయ్ లాంటి క్రేజీ స్టార్ సినిమాకి సంగీత దర్శకుడిగా కుదిరాడు.అయితే ఈ అవకాశం కోసం అతడు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నానని ఎట్టకేలకు అది ఫలించిందని ఎంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.మన డియరెస్ట్ యాక్టర్ విజయ్ అన్నాతో ఎట్టకేలకు నా కల నిజమైంది.. ఇది చాలా గ్రేట్ ఫీలింగ్..! అంటూ థమన్ ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేశాడు. థమన్ ని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేస్తూ పోస్టర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.



ఫర్ మి ఇట్ ఈజ్ గోయింగ్ టు బి... 6-6-6-6-6-6 !! అంటూ ఫైర్ మ్యూజిక్ ఈమోజీలను కూడా షేర్ చేశాడు థమన్. మ్యూజికల్ ఫైర్ వర్క్స్ అన్నిచోట్లా! అంటూ తన ఆనందాన్ని అస్సలు దాచుకోలేకపోయాడు.ఇంతకుముందు వకీల్ సాబ్ సినిమాతో తెలుగు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కూడా తన కల నెరవేరింది. ఇప్పుడు తమిళ  స్టార్ హీరో తో కూడా తన కల నెరవేరినందుకు అలాగే తనకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు కూడా ఛాన్స్ వచ్చినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు థమన్.మహేష్ సర్కారు వారి పాట ఇంకా త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా.. ఈ రెండు సినిమాలకు కూడా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: