‘ఆర్ ఆర్ ఆర్’ 1000 కోట్ల కలక్షన్ మార్క్ ను అందుకుని ఇండస్ట్రీలో మరొక పెను సంచలనానికి తెర తీసింది. సినిమా ధియేటర్లకు జనం భారీగా వస్తారా రారా అన్న సందేహాలకు సరైన సమాధానం ఇచ్చింది. 100 కోట్ల కలక్షన్ ఫిగర్ ను అసలు చూడగలడా అని సందేహాలు వ్యక్తపరిచిన ఫిలిం ఇండస్ట్రీకి బాలయ్య ‘అఖండ’ తో తన స్టామినా ఏమిటో చూపించాడు.
ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం తీవ్ర అసహనానికి దారితీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం సూపర్ హిట్ టాక్ అందుకుని కూడ ‘భీమ్లా నాయక్’ 100 కోట్ల క్లబ్ లో స్థానం పొందలేకపోవడం. వాస్తవానికి ఈమూవీ విడుదలయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాలలో కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
అయినప్పటికీ ఈమూవీకి 100 కోట్లు కలక్షన్స్ రాకపోవడానికి గల కారణం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టిక్కెట్ల రేట్ల వ్యవహారం అన్న వాదన ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రెట్లు తక్కువగా ఉన్న సమయంలో విడుదలైన ‘అఖండ’ ‘పుష్ప’ లాంటి సినిమాలు 100 కోట్ల మార్క్ ను చాల సులువుగా అందుకుంటే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘భీమ్లా నాయక్’ ఎందుకు 100 కోట్ల మార్క్ ను చేరుకోలేకపోయింది అన్న కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.
గత సంవత్సరం విడుదలైన ‘వకీల్ సాబ్’ మూవీకి కూడ బ్లాక్ బష్టర్ హిట్ టాక్ వచ్చింది కానీ 100 కోట్ల క్లబ్ లో చేరలేకపోయింది అప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణం అన్నారు. ఇలా ఎదోఒక కారణంతో పవన్ 100 కోట్ల టార్గెట్ ను మిస్ అవుతున్నాడు అంటూ వస్తున్న వార్తలు అభిమానులను కలవర పెడుతున్నాయి. పవన్ ఈ 100 కోట్ల మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవాలి అంటే అది హరీష్ శంకర్ పవన్ ల కాంబినేషన్ వలెనే జరుగుతుందని తెలిసినప్పటికీ పవన్ ఆమూవీని ఎప్పుడు పట్టాలు ఎక్కిస్తాడో తెలియని పరిస్థితి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి