తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం ‘కేజీ ఎఫ్ 2’ మ్యానియాలో ఉన్నాయి. ఈమూవీకి వస్తున్న కలక్షన్స్ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో ప్రేక్షకులలో మ్యానియా ఏర్పడటం చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ మ్యానియా మరొక వారం రోజులు కొనసాగి ‘ఆచార్య’ విడుదల అయ్యేంతవరకు ఈ కలక్షన్స్ వర్షం కొనసాగే ఆస్కారం ఉంది అంటున్నారు.


దీనితో ఈవారం విడుదల కావలసి ఉన్న రెండు మీడియం రేంజ్ సినిమాలు ఈమూవీ దాటి తట్టుకోలేక వెనకడుగు వేసాయి. యంగ్ హీరో విశ్వక్ సేన్ అదేవిధంగా నాగశౌర్యలు నటించిన ‘అశోక వనములో అర్జున కళ్యాణం’ ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీలు ఈవారం విడుదల అయితే ‘ఆచార్య’ విడుదల అయ్యేవరకు తమ హవా కొనసాగుతుందని తమ సినిమాల డేట్స్ ను చాల ముందుగా ప్లాన్ చేసి లాక్ చేసుకున్నారు.


అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ‘కేజీ ఎఫ్ 2’ మ్యానియాలో ఉండటంతో ఆ మ్యానియాకు ఎదురు వెళ్ళే సాహసం చేయలేకా ఈ రెండు సినిమాలను వాయిదా వేసుకున్నారు. తాత్కాలికంగా ఈసినిమాల రిలీజ్ ను మే మొదటి వారానికి మార్చినప్పటికీ ఈ నెలాఖరున విడుదలయ్యే ‘ఆచార్య’ మ్యానియా ముందు ఈ చిన్న సినిమాలు నిలబడలేవు. పోనీ ఆతరువాత మే రెండవ వారంలో విడుదల అయ్యే ప్రయత్నాలు చేయాలి అనుకుంటే మహేష్ ‘సర్కారు వారి పాట’ మ్యానియా పోటీ ఉంది.


దీనితో ‘కేజీ ఎఫ్ 2’ మ్యానియా వల్ల అనేక మీడియం రేంజ్ సినిమాలు తమ డేట్స్ ను మార్చుకోవలసి వచ్చింది. తెలుగు సినిమాలు ఎంతో బాగా ఉన్నప్పటికీ కన్నడ ప్రేక్షకులు పెద్దగా ఆదరించారు. అయితే మన తెలుగు వాళ్ళకు ఉన్న విశాలహృదయం వల్ల భాషా భేదం లేకుండా  సినిమా నచ్చితే చాలు కోట్లు కురిపించడం మన తెలుగు వారి ప్రత్యేకత. ఇలాంటి పరిస్థితులలో మీడియా రేంజ్ సినిమాలకు రిలీజ్ చేసుకునే అవకాశం దొరకడం లేదు అంటూ నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: