స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్-3. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. హీరోయిన్లుగా తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఎఫ్-2 సినిమా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎఫ్-3 సీక్వెల్ ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ఇప్పటికే ఎఫ్-3 చిత్రం నుంచి విడుదలైన థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ మంచి ఎనర్జిటిక్ ట్యూన్‌ని అందించారు. సినిమా మ్యూజికల్ ప్రయోషన్‌లో భాగంగా ఈ నెల 22వ తేదీన ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా.. ఆహా..’ సెకండ్ సింగిల్ పాటను విడుదల చేయనుంది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్‌ను విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

ఈ ప్రోమో పాటను చూసినట్లయితే.. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, మెహ్రీన్, తమన్నా ఫుల్ జోష్‌లో కనిపిస్తారు. ఫుల్ మాసీ డ్యాన్సులతో సందడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ మరో చార్డ్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేసినట్లు అనిపిస్తోంది. అలాగే ప్రోమో చివరిలో సునీల్ చేసిన స్టెప్పులతో పాటపై ఇంకా హైప్ పెరిగింది. కాగా, పూర్తి సాంగ్ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. కాగా, ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఒక పార్టీ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సందడి చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సాయి శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: