‘కేజీ ఎఫ్ 2’ సక్సస్ అనేకమంది ఆలోచనలను మార్చేసింది. స్క్రీన్ ప్లే విషయంలో అదేవిధంగా టేకింగ్ విషయంలో ఎంత పక్కాగా ఉండాలో ప్రశాంత్ నీల్ టాప్ దర్శకులకు మార్గ దర్శకుడుగా మారాడు. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ పై కూడ ‘కేజీ ఎఫ్ 2’ ను చూసి ప్రభావితుడయ్యాడు అని అంటున్నారు.


ప్రస్తుతం సుకుమార్ తన భార్య పిల్లలతో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ హాలీడేని ఎంజాయ్ చేస్తూ సుకుమార్ ‘పుష్ప 2’ మూవీ కథలో చేయబోయే మార్పులు గురించి ఆలోచనలు చేస్తున్నాడట. తిరిగి సుకుమార్ ఇండియాకి రావడానికి మరొక నెల పట్టే అవకాశం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.


సుకుమార్ ఇండియా తిరిగి వచ్చిన తరువాత ‘పుష్ప 2’ కథ విషయంలో తాను చేసిన మార్పులు అల్లు అర్జున్ కు వివరించి అతడి సలహాలు కూడ తీసుకుని ఆతరువాత మాత్రమే షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఈ విషయాలు అన్నీ జరగడానికి మరో రెండు నెలలు పట్టే ఆస్కారం ఉంది. ఆతరువాత ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలు నిజం అయితే తిరిగి కరోనా 4 వేవ్ మొదలయ్యే పరిస్థితులు ఏర్పడతాయి.


దీనితో ‘పుష్ప 2’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో బన్నీకి కూడ తెలియని పరిస్థితి అని అంటున్నారు. అయితే జరుగుతున్న ఈ ఆలస్యం  రష్మిక కు అదృష్టంగా మారింది. ప్రస్తుతం ఆమె తమిళ టాప్ హీరో విజయ్ తో అలాగే రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమాల షూటింగ్ లు పూర్తిచేసుకునే హడావిడిలో ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వడానికి కనీసం 6 నెలలు పట్టే ఆస్కారం ఉంది. ఈలోపున ‘పుష్ప 2’ మొదలు కాదు కాబట్టి హ్యాపీగా రష్మిక సినిమాలు చేస్తూ ఉంటే బన్నీ మాత్రం ఏమి చేసే పనిలేక ఖాళీగా ఉంటున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ వినిపిస్తున్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: