భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక సాదాసీదా సినిమాగా వచ్చిన కే జి ఎఫ్ సినిమా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది   ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించింది. ఇక ఈ ఒక్క సినిమాతో ప్రశాంత్ నీల్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు. అలాంటి దర్శకుడు తమ తో ఒక సినిమా చేస్తే బాగుండు అని ప్రతి స్టార్ హీరో కోరుకునే విధంగా అందరి దృష్టి ఆకర్షించాడు ప్రశాంత్ నీల్.



 ఇక ఇటీవల కేజిఎఫ్ సినిమాకి సీక్వెల్గా కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఏకంగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి వెయ్యి కోట్ల వసూళ్లను కూడా సాధించింది. అయితే కేజిఎఫ్ సినిమా తో అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఎంత గుర్తింపు వచ్చిందో కన్నడ హీరో యష్ కి కూడా భారతదేశవ్యాప్తంగా అంతే గుర్తుకు వచ్చింది. అదే సమయంలో ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టికి కూడా కే జి ఎఫ్ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటోంది అని చెప్పాలి. అప్పటి వరకు ఎవరికీ తెలియని శ్రీనిధి ఒక్కసారిగా కేజీఎఫ్ తో సుపరిచితురాలు గా మారిపోయింది. మరి అలాంటి శ్రీనిధి శెట్టి గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


 1992 అక్టోబర్ 21వ తేదీన జన్మించింది శ్రీనిధి శెట్టి. కాగా ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసింది. అయితే కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ వైపు అడుగులు వేసింది శ్రీనిధి శెట్టి. ఇక మోడలింగ్ లో కూడా రాణించింది అని చెప్పాలి.ఈ క్రమంలోనే 2015లో మిస్ కర్ణాటక కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత కూడా వెనకడుగు వేయకుండా 2016లో మిస్ దివా అవార్డు కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే ఈ అవార్డును సొంతం చేసుకున్న రెండవ భారతీయ మహిళగా గుర్తింపు సంపాదించింది శ్రీనిధి శెట్టి. ఇప్పుడు విక్రమ్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: