సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. కీర్తిసురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ సర్కారు వారి పాట. ఇటీవల మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది.  ఇకపోతే పరుశురాం దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో పాటు GMB ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14 రీల్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక మొదటి రోజు మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటూ మంచి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది ఇటీవలే కర్నూల్లో కూడా సక్సెస్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా నిర్వహించారు.

ఇటీవల ఆ ఫంక్షన్లో ఫాన్స్ ని చూసి ఎంజాయ్ చేసిన మహేష్ బాబు తానే స్వయంగా స్టేజ్ పైకి వెళ్లి మరీ స్టెప్పులు వేసి అద్దరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు యూట్యూబర్ ల కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు మహేష్ బాబు. ఈ సినిమాలో కీర్తి మెసేజ్ పెట్టిన సందర్భంలో మహేష్ డైలాగ్ చెప్పకుండా సోఫాలోకి ఎగిరి గెంతేస్తారు . ఇక ఈ ఐడియా థియేటర్లో బాగా పేలింది.. ఐడియా ఎవరిది అని మహేష్ బా ను  అడగగా అతను తనదే అని చెప్పారు. అంతేకాకుండా ఈ సీన్లో రియాక్షన్ ఇస్తూ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది. కానీ అది బాగా లెంగ్తీ గా అనిపించింది.. అందుకే సింపుల్ గా రియాక్షన్ తో చెబితే బాగుంటుంది అని అనిపించిందట. అందుకే అలా చేశారట మహేష్ బాబు.

ఈ క్రమంలోనే మహేష్ బాబును  కీర్తి సురేష్ సినిమాలో తిట్టే సన్నివేశం గురించి ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు.ఈ సినిమాలో ఒక సీన్లో కీర్తి నన్ను బాగా తిట్టాలి . ఇక అప్పటికే మూడు టేకులు కూడా తీసుకున్నాము. అయినా కూడా కీర్తి చేయలేక పోయింది. దాంతో డైరెక్టర్ దగ్గరికి వెళ్లి మేడం మీరు తిట్టాలి బాగా గుర్తు పెట్టుకోండి మీరు మహేష్ ను తిట్టాలి అని చెప్పాడు. కానీ నన్ను తిట్టడానికి ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకోని  నేనే తిట్టమని చెప్పాను..అప్పుడు కీర్తి సార్ నేను మిమ్మల్ని ఎలా తిట్టాలి.. ఒకవేళ  తిట్టినా మీ అభిమానులు నన్ను తిడతారు అంటూ చాలా కంగారు పడింది. అప్పుడు నేను ఏం పర్వాలేదు అమ్మ.. నన్ను తిట్టు వాళ్ళు నిన్ను ఏమీ అనరు అని ఆమెతో చెప్పాను. ఇకపోతే సినిమాను నా కుటుంబంతో కలిసి చూసినప్పుడు ఆ సీన్ చూస్తున్నంత సేపు సితార ఇచ్చిన రియాక్షన్స్ నేను ఎప్పుడూ చూడలేదు.  తను నవ్వుతూ సోఫా నుంచి కిందపడి మరీ నవ్వింది..అలా ఆ సీన్ వెనుక ఉన్న సీక్రెట్ గురించి బయట పెట్టాడు మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: