ఇటీవల కాలంలో జీవిత.. రాజశేఖర్ ఇద్దరూ కూడా వేర్వేరు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా రాజశేఖర్ హీరోగా తన భార్య జీవిత రాజశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన శేఖర్ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఇక ప్రముఖ ఓ టీ టీ సంస్థల నుంచి చాలా ఆఫర్లు వచ్చినా ఈ సినిమా మాత్రం థియేటర్లలోనే విడుదల చేశారు. అయితే మలయాళం మూవీ జోసెఫ్ కు పూర్తి రీమేక్ లా ఈ సినిమా ఉంది అని నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 

ఇక క్రిటిక్స్ సైతం శేఖర్ సినిమా ఒకసారి చూడవచ్చు అనేలా ఉంది అని.. సినిమాలో పెద్దగా చూడాల్సిన అంశాలు ఏవీ లేవు అని చెప్పుకొచ్చారు. ఇక పోతే రాజశేఖర్ అలాగే జీవితసినిమా కోసం ఎంతో కష్టపడి ప్రమోషన్స్ కూడా నిర్వహించినా ప్రమోషన్స్ కి తగిన ఫలితం కనిపించడం లేదని తెలుస్తోంది.శని,  ఆది వారాలలో ఈ సినిమాకు బుకింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం .మరొకవైపు ఈ సినిమాకు సివిల్ కోర్టు మతిపోయేలా రాజశేఖర్ , జీవిత కు షాక్ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే పరంధామరెడ్డి అనే ఒక ఫైనాన్షియర్ .. జీవితా రాజశేఖర్ తన దగ్గర 65 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని.. ఇక శేఖర్ సినిమా కోసం తీసుకున్న ఆ మొత్తాన్ని ఇంకా ఆమె తిరిగి చెల్లించలేదని కోర్టుకు వెల్లడించారు.

 ఇకపోతే సిటీ సివిల్ కోర్టు ఆదివారం సాయంత్రం 4:30 గంటల లోపు జీవిత-రాజశేఖర్ 45 లక్షల రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్ గా కోర్టులో సమర్పించాలని ఆదేశించడం జరిగింది.. ఒకవేళ కట్ట లేని పక్షంలో శేఖర్ సినిమాను నిలిపి వేయడం జరుగుతుంది అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది మరి ఈ విషయంపై జీవిత ఎలా వ్యవహరిస్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: