విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రం మే 6 న విడుదలై ఒక మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక అంతే కాకుండా ఈ సినిమా విడుదల సమయంలో ఒక న్యూస్ ఛానల్ లో హీరో విశ్వక్ సేన్ గొడవ పడడం కూడా జరిగింది. దాని వల్ల ఈ చిత్రం బాగా పబ్లిసిటీ జరిగింది. అల్లం అర్జున్ ప్రసాద్ అనే పాత్రలో విశ్వక్సేన్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. 33 ఏళ్లు పెళ్లి కానీ ఒక అడుగు ఎంతో అద్భుతంగా నటించారు విశ్వక్ సేన్. ఇక ఇందులో హీరోయిన్గా రుక్సార్ నటించింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ వీక్ ఎండ్ వచ్చేసరికి బాగానే క్యాష్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక బడా హీరోల సినిమా విడుదల అవుతున్న ఈ సినిమా కలెక్షన్స్ సైలెంట్ అయిపోయాయి అన్నట్టుగా తెలుస్తుంది వాటి గురించి చూద్దాం.

1). నైజాం-1.72 కోట్లు.
2). సీడెడ్-48 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-42 లక్షలు.
4). ఈస్ట్-25 లక్షలు.
5). వేస్ట్-21 లక్షలు
6). గుంటూరు-28 లక్షలు
7). కృష్ణ-25 లక్షలు.
8). నెల్లూరు-16 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..3.77 కోట్ల రూపాయలు.
10). రెస్టాఫ్ ఇండియా-22 లక్షలు.
11). ఓవర్సీస్-48 లక్షలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.4.47 కోట్ల రూపాయలను రాబట్టింది.

అశోకవనంలో అర్జున్ కళ్యాణం చిత్రం థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.5.96 కోట్ల రూపాయలు జరిగిన ఈ చిత్రం సక్సెస్ కావాలి అంటే.. రూ.6 కోట్లను కలెక్షన్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ చిత్రం ముగిసే సమయానికి 4.47 కోత రూపాయలను మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యర్లకు రూ.1.53 కోట్ల రూపాయల నష్టాన్ని ఈ సినిమా మిగిల్చిందని చెప్పవచ్చు. మరి ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: