తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ కు ఇప్పటికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉందని చెప్పవచ్చు.. తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందుకున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం శేఖర్. రాజశేఖర్ కెరీర్ లో ఇది 91వ చిత్రం గా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాకి జీవిత రాజశేఖర్ డైరెక్షన్ వహించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాను త్రిపుర క్రియేషన్ పతాకంపై వీరం సుధాకర్ రెడ్డి, రాజశేఖర్ కూతురు నిర్మాతలు గా వ్యవహరించారు. శేఖర్ చిత్రం గత వారం శుక్రవారం రోజున విడుదలైంది. అయితే ఈ సినిమా పై.. ఫైనాన్సియల్ పరంధామ రెడ్డి కేసు వేయడం జరిగింది.


దింతో ఈ సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసినదే.. ఈ వివాదంలో జీవిత రాజశేఖర్ శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయ స్థానం మాట్లాడినట్లుగా సమాచారం అందుతోంది. శేఖర్ చిత్రం ప్రదర్శన నిలిపి వేయాలని తానెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం తెలియజేసినట్లు తెలిపింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే సినిమా ప్రదర్శనను ఆటంకం కలిగిస్తున్నారని రాజశేఖర్ తెలియజేశారు. కానీ ఈ సినిమాని నిలిపివేయాలని కోర్టు నుంచి ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేశారు న్యాయ సంస్థ. శేఖర్ చిత్రాన్ని ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రదర్శించు కోవచ్చని న్యాయస్థానం తెలియజేసింది.

జీవిత రాజశేఖర్ నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. దీంతో జీవిత రాజశేఖర్ శేఖర్ చిత్రాన్ని నిరభ్యంతరంగా ప్రదర్శించు కోవచ్చని న్యాయస్థానం తెలియజేయడంతో కాస్త ఈ సినిమా నుంచి ఊరట లభిచిందని చెప్పవచ్చు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్ర ఎంతటి కలెక్షన్లను రాబడుతోంది తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: