టాలీవుడ్ లో ఉన్న కొంతమంది హీరోయిన్లు లలో కూడా మెహ్రిన్ ఒకరు. తన చూపులతో ,అందంతో ప్రేక్షకులను బాగా ఆలరిస్తు ఉంటుంది. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తను నటించిన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని చేకూర్చింది ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన ఆమె కెరీర్ ప్లస్ గా మారాయి. అయితే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఈమె అంతగా ఆకట్టుకోలేక పోతోంది. అటు తరవాత తను ఎంచుకున్న కథలు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేక పోవడమే అని చెప్పవచ్చు.


ఇక అలాంటి సమయంలో తన దగ్గరికి సరైనోడు చిత్రం ఆఫర్ రాగా తను వదులుకోవడం తో తన కెరీర్ వేరేలా గా మారిపోయిందని మెహ్రిన్ చాలా బాధపడుతుంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అవకాశం కొన్ని కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చింది అని తెలియజేసింది. ఆ చిత్రంలో నటించక పోవడం ఇప్పటికీ బాధగానే ఉందని తెలియజేస్తోంది.

ఈ సినిమాలో నటించింటే తన కెరీర్ వేరేలా ఉండేదని ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నది. గతంలో కూడా ఇలాంటి వరుస ప్లాపులు వచ్చినప్పుడు తనని f-2 సినిమానే ఆదుకుందని.. అలాగే ఈసారి ఫ్లాపులు వచ్చినప్పుడు తనని f-3 సినిమా కవర్ చేస్తోందని ఆమె భావిస్తోంది. తన కాలేజీ రోజుల గురించి కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. కాలేజీ రోజుల్లో చాలా మంది ఆమె వెంట పడే వారని.. కాస్త ధైర్యం చేసి ఎంతో మంది కూడా తనకి ఐ లవ్ యు చెప్పిన వాళ్లు చాలామందే ఉన్నారని తెలిపింది. అప్పట్లో తన కాస్త మాస్ గా ఉండేదానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: