సాధారణంగా మనలో చాలా మందికి మనం ఇష్టపడే సెలెబ్రిటీల ఇష్టాయిష్టాల గురించి తెలుసు కోవాలి అని బాగా ఉంటుంది. వారి గురించి తెలుసు కోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాం కూడా..


ఒకప్పుడు అంటే ఇలా తెలుసు కోవాలంటే ఎలా తెలుసుకోవాలో కూడా అస్సలు తెలియదు.. కానీ ఇప్పుడు అలా కాదు.. మనం ఏం తెలుసు కోవాలి అని అనుకున్నా సోషల్ మీడియా అందుకు చాలా సహాయంగా ఉంటుంది.


ఇది వరకు సినిమాల్లో తప్ప బయట ఫ్యామిలీ గురించి కానీ వారి గురించి కానీ అస్సలు తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు అలా కాదు.. సోషల్ మీడియా డెవలెప్ అయ్యాక అన్ని కూడా నిముషాల్లో ఇంట్లో కూర్చుని మరి తెలుసు కోవచ్చు. సెలెబ్రిటీలు అంతా కూడా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వారి గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతూ ఉంటారు.. తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఫ్రెండ్ తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పిందట.. అవి కాస్త నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.


ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినపోయిన బ్యూటీ కృతి శెట్టి. బేబమ్మ గా ఈమె చేసిన పాత్ర ప్రేక్షకులకు తెగ కనెక్ట్ అయ్యింది. ఉప్పెన అంత పెద్ద హిట్ అవ్వడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయట.


ఉప్పెన తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్, మరియు బంగార్రాజు రెండు కూడా విజయం సాధించడంతో మరికొన్ని అవకాశాలు అమ్మడిని వరించాయి.

ప్రెసెంట్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న కృతి ఈమె గురించి ఈమె ఫ్రెండ్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపిందట.కృతి శెట్టి కి చాకోలెట్స్, స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదట.. కానీ ఈమెకు బూస్ట్ అంటే చాలా ఇష్టం అని ఇప్పటికి కూడా దొంగతనంగా బూస్ట్ దొంగిలించి తింటుంది అని.. అలాగే ఫోన్ లో కూడా ఈమె కార్టూన్స్ చుస్తే కానీ నిద్ర పట్టదని తెలిపిందట కృతి ఫ్రెండ్.. ఈ వీడియోలు చూడక పోతే అస్సలు పడుకోదు. ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: