అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్టరీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న మూవీ ఎఫ్‌3. అయితే ఈ మూవీని ఎఫ్2 కి సీక్వెల్‌గా తెర‌కెక్కించారు. కాగా ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ట్రైల‌ర్‌, అలాగే పాట‌లు ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అంతేకాదు ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన రిలీజ్ అవుతుంది. అందులో భాగంగానే ఇక చిత్ర ప్ర‌మోష‌న్స్‌ను కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమోషన్ కార్య‌క్ర‌మాల్లో హీరోయిన్ త‌మ‌న్నా త‌ప్ప మిగిలిన అంద‌రూ క‌నిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆమె క‌నిపించక‌పోవ‌డం ఒక చ‌ర్చ‌నీయాంశంగా మారడం విశేషం.

ఇప్పుడు ఎఫ్3 చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో త‌మ‌న్నా ఎక్కడ కనిపించ‌డం లేదు. అయితే తమన్నా కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ఉంది అని కూడా అనుకోవ‌చ్చు. కానీ ఆమె ప్ర‌మోష‌న్ చేయాలి అనుకుంటే సోష‌ల్ మీడియాలో అయినా ఒక చిన్న వీడియో బిట్‌ను అయినా రిలీజ్ చేయవచ్చు. కానీ త‌మ‌న్నా ఇప్పటి వరకు క‌నీసం అలా కూడా చేయలేదు. దీనితో త‌మ‌న్నాకు, చిత్ర యూనిట్ కు మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని.. అందుకనే ఆమె ఎఫ్3 కి సంబందించిన ప్రమోషన్స్ లో పాల్గొనటం లేదని తెలుస్తుంది.  కాగా ఈ వార్త‌ల‌ను ఇప్పుడు ఎఫ్3 చిత్ర యూనిట్ ఖండించడమే కాకుండా.. తమన్నా కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ఉంద‌ని.. అందుకే ఇక్క‌డికి రావ‌డానికి కానీ అలాగే ప్ర‌మోష‌న్స్ చేయడానికి వీలు లేకుండా పోయిందే తప్ప మరో కారణం లేదని యూనిట్ తెలియ‌జేసింది.

అయితే ఏది ఏమైనప్పటికి తమన్నాకి క‌నీసం సోష‌ల్ మీడియాలో వీడియో ద్వారా అయినా ప్ర‌మోష‌న్ చేయ‌వ‌చ్చు క‌దా.. మరి అంత స‌మ‌యం కూడా ఉండదా...అన్న ప్రేక్షకుల ప్ర‌శ్న‌కు మాత్రం చిత్ర యూనిట్ నుండి ఎలాంటి స‌మాధానం లేదు. మరి ఇటివంటి సమయంలోనే ఎఫ్3 యూనిట్‌కు, త‌మ‌న్నాకు మ‌ధ్య వ్య‌వ‌హారం ఏమైనా బెడిసికొట్టిందా అనే వార్త‌లు నిజ‌మే అని అనుకోవాల్సి వస్తుంది. అందుకనే తమన్నా అస‌లు సోష‌ల్ మీడియాలోనైనా ఎఫ్3 మూవీ గురించి ఎటువంటి ప్ర‌మోష‌న్ చేయ‌డం లేద‌ని అంటున్నారు. కాగా అసలు ఇక ఈ వార్త‌ల్లో నిజం ఎంత ఉంది.. అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: