ఫిదా సినిమా తో టాలీవుడ్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఇక తెలుగుతోపాటు మలయాళ ,తమిళ భాషలలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఈమె నటన తో పాటు ఆనందం తో కూడా అభిమానులను సొంతం చేసుకున్నది. చాలా మంది హీరోయిన్స్ స్కిన్ షో చేసే అందంగా కనిపించి.. అందరినీ ఆకట్టుకుంటారు. హాయ్ సాయి పల్లవి వాటన్నిటికీ దూరంగానే ఉంటుంది. అయినా కూడా ఆమెకు స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కింది అని చెప్పవచ్చు.


ప్రస్తుతం సాయి పల్లవి ఒక్క సినిమాకి రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు రెవెన్యూ రేషన్ అందుకుంటోంది అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక అంతే కాకుండా ఈమె వచ్చిన ప్రతి సినిమా కి ఆశపడకుండా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ తన కెరియర్ వైపు అడుగులు వేస్తోంది. తనని ఎలా అయితే ప్రేక్షకులు చూస్తారో అలాంటి పాత్రలు ఎంచుకుంటూ ఉంటోంది. తాజాగా ఒక మీడియా చిట్ చాట్ లో సాయి పల్లవి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా సినిమాలోని స్పెషల్ సాంగ్ ల పై కూడా సాయి పల్లవి స్పందించడం జరిగింది.


అలాంటి  డ్రస్సులు డాన్స్, స్టెప్పులు వేయడం తనకు అస్సలు సెట్ అవ్వవని.. తన వద్దకు ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రమోషన్స్ కోసం వచ్చాయని తాను మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు అని తెలియజేసింది. సాయి పల్లవి ఒక ఏడాదిలో ఐదు సినిమాలు, పలు బ్రాండెడ్ వాటికి ప్రమోషన్స్ కోసం బ్రాండ్ అంబాసిడర్, స్పెషల్ సాంగు లలో నటించి ఉంటే భారీగా ఆదాయం వస్తుండేది అని చెప్పవచ్చు. సాయి పల్లవి అలా కూడా డబ్బులు సంపాదించాలని కుంటే ఇతరుల కంటే ఎక్కువగా సంపాదించేదని చెప్పవచ్చు. ఇవన్నీ చేసి ఉంటే దాదాపుగా రూ. 50 కోట్ల రూపాయల వరకు ఏడాదికి సంపాదించుకుంటూ ఉండేది సాయి పల్లవి. కానీ కేవలం సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి డబ్బు విషయంలో ఎక్కువ ఆసక్తి చూపలేదు అన్నట్లుగా ఆమె అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: