అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి మంచి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో ఏజెంట్ మూవీ పై అక్కినేని అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కి టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అవుతున్నా అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. 

ప్రస్తుతం మాత్రం ఏజెంట్ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ ను చిత్ర బృందం మనాలి లో ప్లాన్ చేశారు. ఈ నేపథ్యం లో ఏజెంట్ సినిమా షూటింగ్ కోసం అఖిల్ తో పాటు చిత్ర బృందం లోని కీలక సభ్యులు ఇప్పటికే మనాలిలో ల్యాండ్ అయ్యారు . ఈ విషయాన్ని ఏజెంట్ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ఈ సారి మంచి విజయం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నాము అని ఆయన తెలియజేశాడు.  

మనాలి లో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే ఈ మూవీ ని ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ సినిమా షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించనుండగా మరో కీలకమైన పాత్రలో ఈ మూవీ లో మమ్ముట్టి కనిపించబోతున్నారు. ఈ మూవీ కి హిప్ హాప్ తమిళ సంగీతం సమకూరుస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: