అయితే దాదాపుగా ఈ సినిమాకి 30 రోజుల సమయం ఉండటంతో ఇంకా సమయం వుంది కదా ప్రమోషన్ ఇప్పుడే అవసరమా అని కామెంట్ కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఈ సినిమా రిలీజ్ కోసం మరొక 30 రోజులు పైనే ఎదురు చూడవలసి ఉంటుంది. అంటూ అభిమానులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. కానీ అభిమానుల కోసం ఈ సినిమాని జూన్ 17వ తేదీకి ఫైనల్ గా మార్చేసారు చిత్రబృందం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బాగా వైరల్ గా మారుతుంది.
ఇక ఈ చిత్రం తెలంగాణలో 1990వ సంవత్సరంలో నక్సల్ ఉద్యమం సంచలనం సృష్టించింది.. ఆ టైంలో భువనగిరి లో ఉన్న బెల్లి లలిత హత్య బాగా పాపులర్ గా మారింది. నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఈమె ఈ విప్లవ గీతాలని బాగా పాపులర్ చేస్తూ ప్రజలలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉండేదట. అలాంటి ఈమె నక్సలైట్ ముఠాను అత్యంత దారుణంగా చంపారు అట. ఇక ఈమె శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికి తమ శరీర భాగాలను అక్కడ అక్కడ పడేయడం తో సంచలనంగా మారింది. ఇక ఇదే పాత్ర స్ఫూర్తితో విరాట పర్వంలోని సినిమాలో సాయి పల్లవి పాత్ర డిజైన్ చేశారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి