ఇక మరోపక్క పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న జన గణ మన సినిమాలో కూడా పూజా హెగ్దే నటిస్తుంది. ఈ సినిమాలో కేవలం గ్లామర్ షోనే కాదు యాక్షన్ సీన్స్ లో కూడా పూజా హెగ్దే నటిస్తుందని అంటున్నారు. పూజా హెగ్దే సినిమాలో ఉంది అంటే గ్లామర్ విషయంలో ఢోకా లేదన్నట్టే ఉంటుంది కానీ అమ్మడు మాత్రం పూరీ జన గణ మన సినిమాలో తనలోని కొత్త యాంగిల్ చూపించబోతుందని తెలుస్తుంది. పూజా యాక్షన్ మోడ్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.
ఇప్పటివరకు పూజా హెగ్దేలోని ఒక యాంగిల్ నే చూడగా ఇప్పుడు జన గణ మన కోసం డిఫరెంట్ లుక్ తో.. సరికొత్త యాక్షన్ తో చూపించబోతుందని తెలుస్తుంది. మహేష్ త్రివిక్రం సినిమాతో పాటుగా పవన్, హరీష్ శంకర్ కాంబో మూవీలో కూడా పూజా హెగ్దే నటిస్తుందని టాక్. అయితే ఆ ప్రాజెక్ట్ నుండి అమ్మడు తప్పుకుందని లేటెస్ట్ న్యూస్. మరి చిత్రయూనిట్ నుండి అఫీషియల్ కన్ ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఏది ఏమైనా పూజా హెగ్దే మాత్రం వరుస మూవీస్ తో దుమ్ముదులిపేస్తుందని చెప్పొచ్చు. జన గణ మన సినిమా పాన్ ఇండియా మూవీగా రాబోతుఇంది ఆల్రెడీ బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పూజా హెగ్దేకి ఈ సినిమా అక్కడ మరిన ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి