లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ లో కమల్ హాసన్ తో పాటు హేమా హేమీలు అయినా విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ , సూర్య కూడా నటించారు. 

మూవీ లో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించగా,  ఈ మూవీ లో ఫహాద్ ఫాజిల్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. సూర్యమూవీ లో రోలెక్స్ అనే పాత్రలో నటించాడు. సూర్యమూవీ లో తక్కువ సమయమే కనిపించినప్పటికీ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.  ఇది ఇలా ఉంటే అనేక అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన తమిళ , తెలుగు , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో విడుదలైన విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను  బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  థియేటర్ లలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విక్రమ్ సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది.  

విక్రమ్ సినిమా ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో జూలై 8 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ 'ఓ టి టి' సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్ లలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విక్రమ్ సినిమా  'ఓ టి టి' లో ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ని తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: