లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తమిళ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయిన విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించగా,  మలయాళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న ఫహాద్ ఫాజిల్  ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నా సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు.

ఇలా హేమాహేమీలు అయినా నటీనటులు ఈ సినిమాలో నటించడం మానగరం , ఖైదీ , మాస్టర్ వంటి వరస విజయాల తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తెలుగు సినీ ప్రేమికులు కూడా విక్రమ్ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు పెట్టుకున్నారు. మంచి అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన విడుదల అయిన విక్రమ్ సినిమా ఇప్పటి వరకు 27 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 27 వ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.  27 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ సినిమా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

నైజాం : 7.05 కోట్లు , సీడెడ్ : 2.24 కోట్లు , యూ ఎ : 2.43 కోట్లు , ఈస్ట్ : 1.27 కోట్లు , వెస్ట్ : 84 లక్షలు , గుంటూర్ : 1.16 కోట్లు , కృష్ణ : 1.37 కోట్లు , నెల్లూర్ : 60 లక్షలు .
27 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ మూవీ 16.96 కోట్ల షేర్ , 29.70 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లను రాబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: