కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన యష్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . యాష్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన 'కే జి ఎఫ్' మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్నాడు . 

'కే జి ఎఫ్ చాప్టర్ 1' మూవీ తోనే అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న యష్ తాజాగా కొన్ని రోజుల క్రితం విడుదల అయిన 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ తో ఆ క్రేజ్ ను మరింతగా పెంచుకున్నాడు . ఇలా  'కే జి ఎఫ్ చాప్టర్ 1' మరియు 'కే జి ఎఫ్ చాప్టర్ 2' సినిమాలు  భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సాధించడంతో యాష్ నటించబోయే తదుపరి సినిమాలపై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి . కే జి ఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత యష్ ఎలాంటి సినిమాలో నటిస్తాడు . ఎ దర్శకుడి సినిమాలో నటించాడు . ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమానా ... కదా ...  అని అనేక విషయాలపై సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు .

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు యాష్ నటించబోయే తదుపరి సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోయే మూవీ లో యష్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే దానిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. మరి దిల్ రాజు యష్ తో ఎ రేంజ్ మూవీ ని నిర్మిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: