సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస పెట్టి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ ను చూపుతున్నాడు. బ్రహ్మోత్సవం , స్పైడర్ లతో వరుస అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత భరత్ అనే నేను ,  మహర్షి , సరిలేరు నీకెవ్వరు తాజాగా సర్కారు వారి పాట మూవీ లతో వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకుంటూ ఫుల్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాడు.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కావడంతో ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు , దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించబోతున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మహేష్ బాబు తో పాటు మరో కీలకమైన పాత్ర కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కోసం నాచురల్ స్టార్ నాని ని ఎంపిక చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇది వరకే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ మూవీ లో నాని కూడా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: