ఇక దీంతో రమేష్ పైన తనకున్న అభిమానం ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో మన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సర్కారు వారి పాట సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలలో కూడా ఈ విషయాన్ని తెలియజేశారు మహేష్ బాబు. ఇక కళ్ళ ముందు అభిమానులు ఉండడంతో పలు విషయాలను చెప్పలేక ఎమోషనల్ కు గురయ్యారు. తన అన్నయ్య హీరో కాలేకపోయారు కనీసం ఒక పెద్ద నిర్మాతగా అయిన చూడాలని తను చాలాసార్లు ఆశపడ్డాను అని మహేష్ బాబు తెలిపారు. రమేష్ బాబు సినిమా చేస్తానంటే అన్ని చిత్రాలు పక్కనపెట్టి అతనితోనే సినిమా చేస్తానని తెలియజేశారు కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందని చాలా బాధపడ్డాడు.
ఈ ప్రేమని రమేష్ బాబు తనయుడు అయిన ఘట్టమనేని జయకృష్ణపై చూపించే అవకాశం ఎక్కువగా ఉన్నది తాజాగా జయకృష్ణ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. జయకృష్ణ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ సేమ్ టు సేమ్ ఉన్నట్లుగా ఈ ఫోటో చూస్తే మనకి అర్థమవుతుంది. ఇద్దరు ముఖాలు ఒకేలా ఉన్నాయి ఒకే రంగు సొంత అన్నదమ్ముల కనిపిస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. క్యాజువల్ డ్రెస్సులు దిగిన జయకృష్ణ ఫోటో ఇది ప్రస్తుతం జై కృష్ణ వయసు 20 సంవత్సరాలు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి