‘పుష్ప’ మూవీ కోసం అల్లు అర్జున్ తన లుక్ లో చాల మార్పులు చేసుకున్నాడు. గుబురు గడ్డం పొడవాటి జుట్టు మాసిన లుంగీ తో ఆమూవీలో కనిపించి తన పాత్ర కోసం తన ఇమేజ్ తో సంబంధం లేకుండా తన లుక్ లో చాల మార్పులు చేసుకున్నాడు. ఈమూవీతో ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ కు పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ‘పుష్ప’ 2పై ఉంది.


వాస్తవానికి ఈ సీక్వెల్ ఈపాటికే మొదలు కావలసి ఉంది. అయితే ‘కేజీ ఎఫ్ 2’ విడుదల తరువాత సుకుమార్ ఆలోచనలలో చాల మార్పులు రావడంతో ‘పుష్ప 2’ స్క్రిప్ట్ విషయమై అనేక మార్పులు చేస్తున్నాడు. ఈ సీక్వెల్ బిజినెస్ 1000 కోట్ల స్థాయిలో చేయాలి అన్నఉద్దేశ్యం సుకుమార్ కు ఉండడంతో స్క్రిప్ట్ విషయంలో పదేపదే మార్పులు జరుగుతున్నట్లు టాక్.


‘పుష్ప’ వన్ లో పుష్ప రాజ్ లారీ డ్రైవర్ స్థాయి నుండి గంధపు చెక్కల స్మగ్లర్ గా ఎలా ఎదిగాడు అన్న విషయం చూపెడితే ఇప్పుడు ‘పుష్ప 2’ లో పుష్ప రాజ్ గంధపు చెక్కల అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎలా ఎదిగి స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఎలా శాసించాడు అన్న విషయం చూపించ బోతున్నాడు. ‘పుష్ప’ పార్ట్ వన్ లో ఉన్న విధంగా రఫ్ గా కాకుండా పార్ట్ 2లో బన్నీ స్టైలిష్ గా కనిపిస్తాడు అన్న సంకేతాలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగా లేటెస్ట్ గా లీక్ అయిన బన్నీ లుక్ లో చాల మార్పులు కనిపిస్తున్నాయి. లాంగ్ హెయిర్ ఉన్నప్పటికీ ట్రిమ్ చేసిన గడ్డంతో బన్నీ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.


దీనితో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు 'పుష్ప 2’ క్లైమాక్స్ లో ‘పుష్ప 3’ కి సంబంధించిన కథ ఉంది అన్న లీకులు సుకుమార్ ఇస్తాడట. ‘పుష్ప 2’ మూవీకి వచ్చే రిజల్ట్ ను బట్టి కొంత గ్యాప్ తీసుకుని ‘పుష్ప 3’ విషయం ఆలోచించాలని సుకుమార్ అల్లు అర్జున్ ల ఆలోచన అని తెలుస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: