ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్, ఈ మధ్యనే ఓ బిడ్డకి తల్లి అయిన సంగతి తెలిసిందే. తల్లి అవుతోందన్న విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుని, తెగ మురిసిపోయిన చందమామ కాజల్, ఇక అప్పటి నుంచీ తన ప్రెగ్నెన్సీ ముచ్చట్లను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూనే వుంది.ఇక బిడ్డ పుట్టాకా కూడా, అమ్మ అనుభూతిని చాలా చాలా ఎంజాయ్ చేస్తోంది కాజల్ అగర్వాల్. కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడంతో సినిమాలకు కూడా కాస్త బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ ఈజ్ బ్యాక్ అనుకున్నారంతా. కానీ, కాజల్ ఆలోచనలు మరోలా వున్నట్లు సంకేతాలు అనేవి అందుతున్నాయి.ఇక బిజినెస్ ఆలోచనలు చేస్తున్న చందమామ నిజమేనా.?  ఇకపై కాజల్ సినిమాల్లో నటించదంటూ తాజాగా కొన్ని రకాల గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయ్. బిజినెస్ వైపుగా కాజల్ అగర్వాల్ ఆలోచనలు చేస్తోందనీ తెలుస్తోంది.


ఇక ఇప్పటికే పలు రకాల బిజినెస్‌లను ఎస్టాబ్లిష్ చేసేసింది కాజల్ అగర్వాల్.ఇక  చందమామ కాజల్ అగర్వాల్ ప్రోటీన్ ఎక్స్ పౌడర్ ఆ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు వహించాడానికి రెడీ అయ్యిందట.సినిమాలతో తాను ఎంత బిజీగా వున్నా, తన చెల్లెలు నిషా అగర్వాల్ ఆ బాధ్యతల్ని పరిపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చిందింతవరకూ. అయితే ఇకపై తల్లిగా బిడ్డను చూసుకుంటూ సినిమాల్లో నటించడం చాలా కష్టమనుకుంటోందట కాజల్.తన చెల్లెలు నిషా అగర్వాల్ కూడా పెళ్లి చేసుకుని, ఇక తల్లి అయ్యాకా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. చెల్లెలి బాటలోనే అక్క కాజల్ కూడా నడుస్తుందా.? అంటే, నిషా పరిస్థితి వేరు ఇంకా కాజల్ పరిస్థితి వేరు. కాజల్ ఒక పెద్ద స్టార్ హీరోయిన్. సౌత్ లో దాదాపు ప్రతి స్టార్ హీరోతో యాక్టింగ్ చేసింది ఆమె. ఇప్పటికీ కూడా ఆమెకు అవకాశాలొస్తున్నాయట. కానీ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: