టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క పెద్దగా సినిమాలేవి చేయకుండా తన అభిమానులను నిరాశ పరుస్తుంది. ఆమె అనుకుంటే కొన్ని అవకాశాలు ఆమె దరికి చేరేవేమో కానీ ఎందుకో ఈ ముద్దుగుమ్మ సినిమాలను చేయడానికి నిరాకరించడం జరుగుతుందట. అందుకే మేకర్స్ ఎవరూ కూడా ఆమెను సంప్రదించడం లేదు. బాహుబలి సినిమా తర్వాత ఒకటి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన అనుష్క ఆ తర్వాత సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

కారణమేదైనా కూడా ఇది అనుష్క అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. ఆ మధ్య కొంత బరువును తగ్గించుకొని ఎంతో ఆకర్షణీయం గా తయారైన అనుష్క అదంతా సినిమాలు కోసమేనని అందరూ భావించారు. కానీ ఆమె బరువు తగ్గించుకోవడం జరిగింది కానీ సినిమాలలో నటించడం మాత్రం జరగలేదు. కారణమేదైనా కూడా ఆ తర్వాత ఆమె ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతుందని అంటున్నారు.

 ఈ మధ్య కాలంలో కొంత లావైన అనుష్క మళ్ళీ బరువు తగ్గడానికి కసరత్తులు చేస్తుందట. మళ్లీ బరువు తగ్గడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆమె అభిమానులు సినిమాలలో నటించడానికి ఆమె ఈ విధమైన పని చేస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే ఇది వాస్తవమా లేదా వేరే దేనికైనా ఆమె ఇలా ఆ విధంగా చేస్తుందా అనేది త్వరలోనే తెలియాల్సి ఉంది. ఆమె గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా ప్రసారం అవుతున్నాయి. దీనికి సంబంధించిన విషయం పై క్లారిటీ రావాలంటే అనుష్క నోరు మెదపాల్సిందే. నవీన్ పోలిశెట్టి హీరో గా ఆమె ఓ సినిమా చేయవలసి ఉంది. మరి ఈ చిత్రం చేస్తుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇంకా పెద్ద హీరోల సినిమాలలో కూడా ఆమె నటించడానికి సిద్ధమవుతుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: