ఉప్పెన చిత్రంతోనే మొదటిసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది హీరోయిన్ కృతి శెట్టి.. తన మొదటి చిత్రంతోనే తనదైన నటనతో అభిమానంతో ఎంతోమంది ప్రేక్షకులను సైతం ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ఇక కృతి శెట్టి తాజాగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా ఆంగ్ల హీరోగా నితిన్ నటించిన ఈ సినిమాని డైరెక్టర్ ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమాలోని ప్రమోషన్ భాగంగా చిత్ర బృందం ప్రమోషన్ పనులను స్పీడు పెంచింది. ఈ కార్యక్రమంలో కృతి శెట్టి నిన్నటి రోజున విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఇక అంతే కాకుండా పలు ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించింది వాటి గురించి చూద్దాం.


కృతి శెట్టి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గం లో తన పాత్ర చాలా సింపుల్గా ఉంటుంది అని తెలిపింది. తన పాత్రలో చాలా సేడ్స్ ఉంటాయని తెలియజేసింది. సన్నివేశాన్ని బట్టి ఒక్కొక్క సీన్ ఒక్కో షేర్ బయటకు వస్తుంది అని తెలిపింది. ఇక ఈ సినిమాతో నితిన్ తనకు మంచి స్నేహితుడయ్యాడని ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి అని తెలియజేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాల పైన తనకు చాలా అభిప్రాయం ఉందని తెలియజేసింది.


ప్రస్తుతం అలాంటి సినిమాలో నటించే ఆలోచన లేదని అయితే దర్శక నిర్మాతలు బలమైన కథ నమ్మకం కలిగించినప్పుడు మాత్రమే అలాంటి విషయంపై ఆలోచిస్తానని తెలిపింది. సినిమాలు కాకుండా వేరే లక్ష్యాలు ఏవైనా ఉన్నాయని ప్రశ్న ఎదురుగా.. అందుకు కృత్తి శెట్టి చిన్న వయసులో నుంచి NGO స్టార్ట్ చేయాలని చాలా కోరిక ఉన్నది త్వరలోనే అలాంటిది మొదలు పెడతానని తెలియజేసింది. ప్రస్తుతం హీరో సూర్యతో కూడా ఈ ముద్దుగుమ్మ ఒక సినిమాలో నటిస్తున్నది. ఆ తర్వాత నాగచైతన్యతో కూడా మరొక సినిమాలో నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: