నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ ఈసారి మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక మాస్ మసాలా చిత్రాన్ని ఎంచుకున్నాడు. గతంలో ఇలాంటి జోనర్ సినిమాలో ఆయన ఎప్పుడూ చేయలేదని చెప్పాలి. ఆ విధంగా ఇప్పుడు తొలిసారి ఈ జోనర్ లో సినిమా చేస్తున్న నితిన్ మంచి విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ముఖ్యంగా పాటలు ప్రేక్షకులలోకి బాగా వెళ్లాయి. అంజలి చేసిన ఒక స్పెషల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ఆ పాటకు వచ్చిన వ్యూస్ బట్టి చెప్పవచ్చు. ఆ విధంగా ఒక పాట ద్వారా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచిన నితిన్ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. 

 అయితే సెన్సార్ సభ్యులు చెబుతున్న వివరణ ప్రకారం ఈ సినిమా తప్పకుండా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందట. నితిన్ యాక్షన్ ఎంతో కొత్తగా ఉందని వారు చెబుతున్నారట. అంతేకాదు కృతి శెట్టి అందాలు కూడా ఈ సినిమాకు మంచి ప్లస్ అవుతున్నాయి అని చెబుతున్నారట. మరి ప్రేక్షకులు ఏ విధంగా ఈ సినిమాను రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం అందించగా ఆయనకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమా ను అయన ఏవిధంగా చేశాడో మరీ. ఇకపోతే నితిన్ ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: