ప్రముఖ సీనియర్ హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే కీర్తి సురేష్ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్, ఆయన కూతుర్లు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అంతే ఇమేజ్ ను నటీనటులకు కూడా అందించింది. అటు దర్శకుడితో పాటు హీరోకి, హీరోయిన్ కి ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సావిత్రి పాత్ర కోసం మొదట వేరే నటిని అనుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఆమెనే ప్రధాన పాత్రధారి అంటూ వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
ఏమైందో తెలియదు కానీ ఆ పాత్రలోకి కీర్తి సురేష్ రావడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కీర్తీ సురేష్ ను  తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా కథానాయకగా మొదట మలయాళ నటిని అనుకున్నారట. ఈ విషయాన్ని అశ్వినీ దత్ స్వయంగా వెల్లడించారు. మా సినిమా కోసం మలయాళ హీరోయిన్ ను  అనుకున్నాము. కథ చెప్పాక అందులో మద్యం తాగే సన్నివేశాలు ఉన్నాయా.. పెట్టద్దు.. అలాంటి ఉంటే చేయను.. అని ఆమె చెప్పింది. అందుకే ఆమెను సినిమాలోకి తీసుకోవడానికి వీల్లేదు అని డైరెక్టర్ తో చెప్పాను అని అశ్వినీ దత్ వెల్లడించారు.

అయితే డైరెక్టర్ హీరోయిన్ పేరు చెప్పలేదు కానీ అప్పట్లో నిత్యామీనన్ పేరు వినిపించింది కాబట్టి ఆమెనే అని అందరూ అంటున్నారు .ఏది ఏమైనా మహానటి లాంటి గొప్ప సినిమా నిత్యకు దూరమైందని చెప్పవచ్చు. ఇకపోతే ఆలీతో సరదాగా షో కి హాజరైన అశ్వినీ దత్ పూర్తి వివరాలను వెల్లడిస్తారేమో తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: