ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్ గా యంగ్ రెబల్ స్టార్ గా కొనసాగిన ప్రభాస్ క్రేజ్ బాహుబలి సినిమా తో ఒక్కసారిగా మారిపోయింది అనే విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించి అదే రేంజ్ సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అదే ప్రభాస్ ఒకప్పుడు ఇండస్ట్రీ లో హిట్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఈ క్రమంలోనే సరైన హిట్టు దక్కుతుందేమో అని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్లాపుల్లో ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కారణంగా ఒక సూపర్ హిట్ సినిమా మిస్ అయ్యాడు.


 ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎన్టీఆర్ సినీ కెరీర్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరూ చూపును ఎన్టీఆర్ వైపు వచ్చేలా చేసింది. అయితే ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా లో ప్రభాస్ నటించాల్సిందట. కాని చివరికి ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.  ఇటీవలే  నిర్మాత అశ్వినీదత్ పోయిందా ఇక ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పడం గమనార్హం.  సీతారామం అనే సినిమాతో అశ్వినీదత్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.


 స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సమయంలో తారక్ను తీసుకోవాలా లేదంటే ప్రభాస్ తీసుకుంటే బాగుంటుందా అన్న విషయంపై అశ్వినీదత్ అయోమయంలో ఉన్నారట. హరికృష్ణ ఫోన్ చేసి తారక్ తో మూవీ చేయాలని కోరడంతో చివరికి ప్రభాస్ ని కాదని తారక్ తో సినిమా చేశాను. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ మేము దైవంగా భావించేవాళ్ళము. అందుకే హరికృష్ణ అడగడంతో కాదనలేకపోయాను అంటూ అశ్వినీదత్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఇక పలు సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. జాతిరత్నాలు సినిమాలో కథ చెప్పడానికి ఏమీ లేదని సీన్స్ మాత్రమే ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: