తమ అందం కోసం, ఆరోగ్యం కోసం సినీ సెలబ్రిటీల సైతం పడే తపన అంతా ఇంతా కాదు.. గ్లామరస్ రంగంలో ఇది చాలా కీలకమైనదని చెప్పవచ్చు. అందుచేతనే వారు నిరంతరం తమకు ఇష్టమైన వాటిని తినకుండా స్లిమ్ గా కనిపించేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా జిమ్ వర్కౌట్లు వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ జిమ్, యోగ వంటివి మిస్ చేస్తే వాటి యొక్క పరిణామం ఎలా ఉంటుందో మనకి తెలిసినదే. ఇక వివాహానికి ముందు ఎంతో స్లిమ్ముగా ఉండే.. మెగా డాటర్ నిహారిక.. వివాహం తర్వాత చాలా బొద్దుగా మారిపోయింది.ఒకవైపు సినిమాలలో నటించకపోవడంతో ఫ్యాట్ కూడా కంట్రోల్ లేకుండా పోయిందని వార్తలు కూడా వినిపించాయి.



కానీ ఇంతలోనే నిహారిక అన్ని ప్రశ్నలకు సమాధానాన్ని తెలియజేయడానికి సిద్ధమయింది.ఇప్పుడు జిమ్ కి వెళ్లడమే కాకుండా ఏకంగా సిక్స్ ప్యాక్ యాబ్స్ చూపిస్తూ షాక్ ఇస్తోంది. ఇటీవల నిహారిక తన భర్తతో కలిసి రెగ్యులర్ గా జిమ్ కు వెళ్లడం చేస్తే తన శరీరాకృతిని చాలా అందంగా మలుచుకుంటోంది. తాజాగా నిహారిక తన భర్త చైతన్య ఇద్దరు కలిసి జిమ్  వర్కౌట్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేయగా కొత్తగా రూపొందుతున్న యాబ్స్ ని ప్రదర్శించడం జరిగింది. ఇక ఈ లుక్కును పరిశీలిస్తే నిహారిక బరువు తగ్గి చాలా స్లిమ్ గా కనిపిస్తోందని చెప్పవచ్చు.నిహారిక గత కొంతకాలం పాటు నటనకు దూరంగా ఉండడం జరిగింది దీంతో తిరిగి మళ్ళీ తను నటనలో నటించడానికి ఇలా ప్రయత్నాలు చేస్తోంది అన్నట్టుగా మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జీ-5 లో హలో వరల్డ్ కోసం నిహారిక పనిచేస్తుంది. దీంతో ఈమె తిరిగి మళ్లీ రియంట్రీ ఇవ్వాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి తన భర్తతో కలిసి హ్యాపీగా సంసార జీవితాన్ని కోరుకుంటోంది నిహారిక అన్నట్లుగా తెలుస్తోంది. మరి అభిమానుల మేరకు తిరిగి రీయంట్రి ఇస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: