టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సైతం మైమరిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా హవా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతోందని చెప్పవచ్చు. అందుచేతనే ఇప్పుడు హీరో కూడా అందుకు తగ్గట్టుగా ఒకసారి కొత్త కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు సినిమాలలో నటించారు సందీప్ కిషన్. అయితే ఇప్పుడు నటించబోతున్న సినిమా గురించి మనం తెలుసుకుందాం.రంజిత్ జయకోడి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో విజయ్ సేతుపతి కూడా కీలకమైన పాత్రను నటిస్తున్నాడు. ఇక వీరితోపాటు గౌతం మేన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నది. మేలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సినిమాని గాడ్ ఓన్లీ ఫర్గివ్స్ అనే టైటిల్ తో సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ బాడీ తో ఒక పోస్టర్ని సైతం విడుదల చేశారు. ఇక అంతే కాకుండా  క్యాప్షన్ రక్తం సేద్యం లక్ష్యం అంటూ ఒక లోగోను కూడా విడుదల చేయడం జరిగింది.


సందీప్ కిషన్ సినిమా బడ్జెట్ కేవలం రూ.10 మార్కెట్ అయితే ఓకే అవుతుంది కానీ ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించడంతో ఈ సినిమా అని దాదాపుగా రూ.40 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సందీప్ కెరియర్ లోని ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ చిత్రామని చెప్పవచ్చు. ఈ సినిమా పూర్తి అయ్యేసరికి మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంత బడ్జెట్ తో రిస్కు చేస్తున్న యువ హీరో సక్సెస్ అవుతాడా అనే విషయం కూడా ఇప్పుడు అనుమానాలు మొదలవుతున్నాయి. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: