టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పోయిన సంవత్సరం నటించిన పుష్ప ది రైస్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. మరి కొన్ని రోజుల్లోనే పుష్ప ది రోల్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. పుష్ప ది రైస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప ది రూల్ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పుష్ప ది రూల్ షూటింగ్ ప్రారంభం కాకముందే అల్లు అర్జున్ తన తదుపరి మూవీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప ది రూల్' మూవీ తర్వాత తమిళ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్నటు వంటి దర్శకులలో ఒకరు అయిన అట్లీ దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ లో హీరోగా నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే అల్లు అర్జున్ ,  అట్లీ కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ అయినటు వంటి మనీ హిస్ట్ స్టోరీ లైన్ కి దగ్గరగా ఉండబోతున్నట్లు ,  ఇప్పటికే దర్శకుడు అట్లీ ,  అల్లు అర్జున్ కథను వినిపించగా అల్లు అర్జున్ కూడా ఈ మూవీ కి ఓకే చెప్పినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు అట్లీ ,  షారుక్ ఖాన్ హీరోగా జవాన్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో నయన తార ,  ప్రియ మణి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: