శ్రీ విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం అల్లూరి ఈ చిత్రంతో ఎలాగైనా సరే ఈసారి కచ్చితంగా హీట్ కొట్టాలని ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. డైరెక్టర్ ప్రదీప్ వర్మ దర్శకుడిగా ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్గా లోహార్ నటించింది.ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23వ తేదీన విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నది. ఈ చిత్రం మొదటి వారం పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ.. కాడి వీక్ డేస్ లో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది ఇక ఆరవ రోజు ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే..


1). నైజాం-29 లక్షలు.
2). సీడెడ్ -17 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-17 లక్షలు
4). ఈస్ట్-11 లక్షలు
5). వెస్ట్ -7 లక్షలు
6). గుంటూరు-11 లక్షలు
7). కృష్ణ-13 లక్షలు
8). నెల్లూరు-5 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.1.10 కోట్ల రూపాయలు.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్- రూ.23 లక్షలు.
11). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ.1.33 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక ఈ అల్లూరి సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.3.42 కోట్ల రూపాయలు జరగక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే కచ్చితంగా రూ.3.7 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది అయితే ఈ సినిమా ఇప్పటివరకు రూ.1.33 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా రూ.2.37 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉన్నది. అయితే ఈ సినిమా వీక్ డేస్ లో పెద్దగా రాణించడం లేదు కాబట్టి ఈ చిత్రం సాధించాలి అంటే చాలా కష్టమే అని ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా అంతటి కలెక్షన్లు రాబడుతుందో లేదో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: