బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన సల్మాన్ ఖాన్ ఎన్నో యాక్షన్ సినిమాలలో నటించారు. అలా ఎన్నో యాక్షన్ సన్నివేశాలలో నటించడానికి హీరోలందరికీ డూపులు ఉంటారు. అచ్చం హీరో లాగా ఉండి మరొక వ్యక్తి చాలా సన్నివేశాలు చేస్తూ ఉంటారు. బాలీవుడ్ లో చాలామందికి ఇలా డూప్స్ ఉండనే ఉన్నారు. అలా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కూడా ఒక డూపు ఉన్నారు.అతని పేరు సాగర్ పాండే.. సల్మాన్ ఖాన్ కు డూపుగా నటిస్తూ ఉంటారు. సాగర్ పాండే పర్సనాలిటీ హెయిర్ స్టైల్ అంతా కేవలం సల్మాన్ ఖాన్ ని పోలి ఉంటుంది.తాజాగా సాగర్ గుండెపోటుతో కన్నుమూయడం జరిగిందట ప్రస్తుతం అతని వయసు 50 సంవత్సరాలు జిమ్ములో వ్యాయామం చేస్తూ ఉండగా ఒకసారి గుండెపోటు రావడంతో కన్నుమూశారు సాగర్ దీంతో బాలీవుడ్ స్టార్స్ సాగర్ పాండే మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ కూడా సోషల్ మీడియా వేదికగా సాగర్ పాండే మృతికి సంతాపాన్ని తెలియజేశారు. ఇక తనతో దిగిన సాగర్ పాండే ఫోటోను కూడా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ ఫోటోని షేర్ చేశారు.


నాతో ఇన్ని రోజులు ప్రయాణం చేసినందుకు తనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అతడు నా సోదరుడు లాంటి వారు అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ధన్యవాదాలు తెలియజేశారు. సల్మాన్ ఖాన్. బజరంగ్ భాయిజాన్, ట్యూబ్ లైట్, దబాంగ్, దబాంగ్-2 తదితర సినిమాలలో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన సాగర్ పాండే. ఇక కరోనా సమయంలో కూడా ఆఫర్స్ లేకపోవడంతో చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డాడట సాగర్ పాండే ఆ సమయంలో సల్మాన్ ఖాన్ తనకు ఆర్థికంగా సహాయం చేశారని ప్రతినెల కొంత డబ్బులను పంపించే వారిని ఒక ఇంటర్వ్యూల సాగర్ పాండే తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తే సల్మాన్ ఖాన్ ఎంత మంచి వారో మనకి అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: