హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంజన ఆనంద్ కలిసి నటించిన చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఈ చిత్రంలో కృష్ణారెడ్డి, బాబా భాస్కర్ వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె ఈ చిత్రానికి దర్శకుడుగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 16వ తేదీన విడుదల అయింది ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మంచితనం తెచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్ట లేక పోయింది. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-30 లక్షలు.
2). సీడెడ్ -17 లక్షలు.
3). ఉత్తరాంధ్ర -15 లక్షలు
4). ఈస్ట్ -9 లక్షలు
5) వెస్ట్ -7 లక్షలు
6). గుంటూరు-12 లక్షలు
7). కృష్ణ-10 లక్షలు
8). నెల్లూరు -6 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.1.6 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా- రూ.7 లక్షలు.
11). ఓవర్సీస్- రూ.8 లక్షలు.
12). ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.1.21 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.6.35 కోట్ల రూపాయలు జరగగా.. ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే రూ.6.6 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉన్నది. ఈ సినిమా ముగిసే సమయానికి కేవలం రూ.1.21 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యారులకు ఏకంగా రూ.5.14 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికీ కిరణ్ అబ్బవరం వరసగా మూడు వరుస ఫ్లాప్ లను చవి చూశాడు. రాబోయే సినిమాల  కథల విషయంలో డైరెక్టర్ల విషయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటేనే హీరోగా కిరణ్ అబ్బవరం  నిలబడతారని చెప్పవచ్చు. లేదంటే ఇక ఈ హీరో పని అయిపోయినట్టే అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: