మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడి గా ఈ మూవీ లో పూజా హెగ్డే నటించింది. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా నక్సలైట్ పాత్రలలో నటించారు. ఈ మూవీ లో సోను సూద్ ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ,  మెలోడీ బ్రహ్మ మణిశర్మమూవీ కి సంగీతాన్ని అందించాడు.

మూవీ భారీ అంచనాల నడుమ కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. అలా భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఆచార్య మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ని సంపాదించుకుంది. అలా విడుదల అయిన మొదటి రోజే ఆచార్య మూవీకి నెగటివ్ టాక్ దక్కడంతో ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. అలా ఉంటే థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయినా ఆచార్య మూవీ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది.

మూవీ సాటిలైట్ హక్కులను జెమిని సంస్థ దక్కించుకుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీ లో ప్రసారం కాబోతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య మూవీ ని దీపావళి పండుగ సందర్భంగా జెమినీ టీవీ లో ప్రసారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిన ఆచార్య మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: