మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ నేడు(బుధవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కు తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఇక ఈ తో సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని అటు మెగాస్టార్, ఇటు మోహన్ రాజా గట్టి నమ్మకంతో ఉన్నారు.
మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా ఈ తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ లో మార్పులు చేర్పులు చేశారు. ఇక ఈ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ లో నయన తార మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ గా నయన్ ఈ మూవీలో కనిపించనున్నారు. మోహన్ రాజా తమిళ్ లో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన తని ఒరువన్ తెలుగులో ధ్రువ పేరుతో రిమేక్ అయిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ తర్వాత మోహన్ రాజా తెలుగులో లు చేయనున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున తో ఓ ప్లాన్ చేస్తున్నాడట ఈ డైరెక్టర్. అయితే నాగార్జున మాత్రమే కాదు అఖిల్ కూడా ఈ లో నటించనున్నాడట. నాగ్ , అఖిల్ తో ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ను ప్లాన్ చేస్తున్నాడట మోహన్ రాజా. గాడ్ ఫాదర్ కంప్లీట్ అయిన వెంటనే ఈ పనిలో ఉంటాడని అంటున్నారు.

ఇటీవలే నాగ్ నటించిన ఘోస్ట్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అఖిల్ మాట్లాడుతూ.. నాన్న తో ఓ చేస్తున్నా అంటూ హింట్ కూడా ఇచ్చాడు. మరి ఈ తండ్రీకొడుకులను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ చేస్తున్నాడు. అలగే అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ చేస్తున్నాడు. నాగార్జున ఘోస్ట్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: