హీరో లేకుండా
సినిమా ను మొదలు పెట్టడం కొత్తేమీ కాదు కానీ మొదటి నుంచి
హీరో లేకుండా సినిమాను చేయడమే ఇప్పుడు సరికొత్త విషయం అని చెప్పాలి.
ప్రభాస్ హీరో గా
మారుతి దర్శకత్వం లో ఓ
సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పక్కా కమర్షియల్
సినిమా లాంటి భారీ ఫ్లాప్ తర్వాత
మారుతి ప్రభాస్ లాంటి పాన్
ఇండియా హీరో తో
సినిమా చేయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అనేది చెప్పాలి.
ఏదేమైనా ఇది ముందుగా ఒప్పుకున్న
సినిమా కావడంతో
మారుతి ఈ చిత్రాన్ని మొదలుపెట్టే విధంగా ముందుకు పోతున్నాడు. అయితే
ప్రభాస్ డేట్స్ లేకపోవడం తో ఈ
సినిమా ఎప్పుడు మొదలవుతుందో అన్న గ్యారెంటీ ఎవరు ఇవ్వలేకపోయారు. కానీ దీనికి సంబంధించి
మారుతి సరి కొత్త ఉపాయాన్ని కనిపెట్టాడు. ముందుగా
హీరో లే ని సీన్స్ ను పూర్తి చేసి ఆ తర్వాత
హీరో సీన్స్ షూట్ చేయాలని ఆయన భావించడంతో ఆ విధంగా షెడ్యూల్ రూపొందించబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ గ్రాండ్ గా మొద లు కాబోతుంది. ఇప్పటివరకు ఈ
సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.
కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం కొంతమంది
మారుతి సన్నిహితులు ఈ
సినిమా 100కు 100% ఉందని చెబుతున్నారు. మరి ఈ
సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడు వ స్తుందో చూడాలి.
ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్టుకే యొక్క
సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాబోతుంది ఆ తర్వాత ఆయన మారు తి
సినిమా యొక్క షూటింగ్ చేయబోతున్నాడట.
యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి డీలక్స్
రాజా అనే టైటిల్ ను నిర్ణయించగా హారర్ నేపథ్యం లో ఈ
సినిమా రూపొందించింది అని తెలుస్తుంది.