కోలీవుడ్ నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ గురించి ఆయన నటన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి మేకప్ ఉపయోగించకుండా చాలా నేచురల్ గా కనిపించే అజిత్ అంటే అందరికీ ఎనలేని అభిమానం. అయితే తాజాగా ఈయన నటిస్తున్న సినిమా తునివు. ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనికపూర్ నిర్మాణ సాధ్యంలో తెరకెక్కుతోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ హీస్ట్ డ్రామా జనవరి 10 2023న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. తాజా అప్డేట్ ప్రకారం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ నీ డిస్ట్రిబ్యూట్ చేసిన "సరిగమ సినిమాస్ " ఈ చిత్రాన్ని యూఎస్ఏ రీజియన్ లో విడుదల చేస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తోంది.  సంజయ్ దత్,  సముద్రఖని,  మహానటి శంకర్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.  ఈ సినిమాను బోనీకపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి పై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి పాటల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మరింత శుభవార్త అని చెప్పవచ్చు. త్వరలోనే సింగిల్ ట్రాక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త తెలుపుతూ తాజా అప్డేట్ ఇచ్చారు చిత్రం మేకర్స్. అసలు విషయంలోకి వెళ్తే..  ఈరోజు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ట్రాక్ అప్డేట్ రివీల్ కానుంది అని,  చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


ఇప్పటికే ఈ సినిమా పోస్టర్,  టీజర్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.  పైగా అజిత్ హీరోగా నటిస్తున్నాడు అంటే ఈ సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్టుగా సమాచారం.  మరి ఈరోజు అప్డేట్ రాబోతున్న సింగిల్ ట్రాక్ విడుదలయితే ఎలాంటి అంచనాలు పెరుగుతాయో తెలియాల్సి ఉంది.  మొత్తానికైతే సంక్రాంతి బరిలో సక్సెస్ కొట్టే విధంగా కనిపిస్తున్నాడు అజిత్.

మరింత సమాచారం తెలుసుకోండి: